అమెరికాలో 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ హక్కులు చేజిక్కించుకున్న సరిగమ సినిమాస్, రఫ్తార్ క్రియేషన్స్
- రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్'
- ప్రధానపాత్రల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్
- బిజినెస్ లోనూ 'ఆర్ఆర్ఆర్' దూకుడు
- అమెరికాలో అక్టోబరు 12న ప్రీమియర్స్
- అక్టోబరు 13న వరల్డ్ వైడ్ రిలీజ్
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం బిజినెస్ లోనూ దూసుకుపోతోంది. తాజాగా అమెరికాలో 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ హక్కులను సరిగమ సినిమాస్, రఫ్తార్ క్రియేషన్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు చేజిక్కించుకున్నాయి. అమెరికాలో అక్టోబరు 12న ప్రీమియర్ షోలు ఉంటాయని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా తమిళనాడులో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ ను లైకా ప్రొడక్షన్స్ దక్కించుకోగా, ఉత్తరాది రాష్ట్రాల్లో పెన్ స్టూడియోస్ చేజిక్కించుకుంది. అంతేకాదు, అన్ని భాషల ఎలక్ట్రానిక్, డిజిటల్, శాటిలైట్ హక్కులను పెన్ స్టూడియోస్ కొనుగోలు చేసింది. విభిన్న తరహా కథాంశంతో వస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రం అక్టోబరు 13న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.