ఏపీ సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!
- కరోనా వల్ల నష్టపోయిన చిత్ర పరిశ్రమకు చేయూతనిచ్చారు
- తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని ప్రకటన
- సినీనటులు చిరంజీవి, అక్కినేని నాగార్జునకు కూడా థ్యాంక్స్
కరోనా వైరస్ వల్ల తీవ్రంగా నష్టపోయిన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చేయూతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న పలు నిర్ణయాల పట్ల తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హర్షం వ్యక్తం చేసింది. ఆయనతో పాటు ఈ విషయంలో తమకు సహకరించిన సినీనటులు చిరంజీవి, అక్కినేని నాగార్జున సహా పలువురికి కృతజ్ఞతలు తెలుపుతూ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ కిషన్ దాస్ నారంగ్, గౌరవ కార్యదర్శులు కేఎల్ దామోదర్ ప్రసాద్, ఎం రమేశ్ పేరిట ఓ ప్రకటన విడుదలైంది.
ఏప్రిల్, మే, జూన్ నెలలకు థియేటర్ల యాజమాన్యాలు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్ కరెంట్ చార్జీలను పూర్తిగా రద్దు చేస్తూ, మిగిలిన ఆరు నెలల చార్జీలను కూడా వాయిదాల్లో చెల్లించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. అలాగే, పలు విషయాల్లో జగన్ తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని ఆ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.