డెడ్ స్టోరేజ్ కి నీరు... ఖాళీ అయిన శ్రీశైలం జలాశయం!
- 2020 ఆరంభంలో పూర్తిగా నిండిన ప్రాజెక్టులు
- ఆపై వర్షాలు కురవక ప్రాజెక్టులు ఖాళీ
- 9న కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశం
గడచిన వర్షాకాలంలో భారీ వరదలు లేకపోవడంతో, ఇప్పటివరకూ 2019, 2020 ఆరంభంలో వచ్చిన వరదల నీటితోనే నెట్టుకుని వచ్చిన శ్రీశైలం జలాశయం ఇప్పుడు ఖాళీ అయింది. శ్రీశైలం రిజర్వాయర్ లో కనీస నీటి మట్టం 834 అడుగులు కాగా, ప్రస్తుతం 812 అడుగులు మాత్రమే నీరుంది. దీంతో జలాశయం వెలవెలబోతోంది. విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికే నిలిచిపోగా, జలాశయం నుంచి నీరు వెళ్లే ఎత్తిపోతల పథకాలకు నీటిని లిఫ్ట్ చేయలేని పరిస్థితి నెలకొంది.
ఈ పరిస్థితుల్లో 9న కృష్ణా బోర్డు ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించుకుని, ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు సమాచారాన్ని పంపంది. ఇదే సమయంలో రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్న జలాశయాల్లో ఉన్న నీటి వివరాలు, వాటిని వాడుకున్న తీరుపై అవసరమైన మొత్తం సమాచారాన్ని తమకు అందించాలని కోరింది. అన్ని అంశాలపై త్రిసభ్య కమిటీతో కూడిన బోర్డు చర్చించి, ఆపై మిగులు నీటి పంపిణీపై నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది.
వాస్తవానికి ఈ సంవత్సరం కృష్ణా, గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ నీటితో నిండిపోయాయి. ఇదే సమయంలో కృష్ణా బేసిన్ లో ఏకంగా 1,280 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయింది. శ్రీశైలం ప్రాజెక్టులో మొత్తం నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ఇప్పుడు కేవలం 35.73 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ సంవత్సరం నీటి నిల్వను కనీస మట్టం కన్నా కిందకు తగ్గకుండా చూడాలని గతంలో జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నా, వేసవి ఇంకా పూర్తిగా ఆరంభం రాకముందే నీరు కనీస మట్టానికన్నా కిందకు పడిపోవడం గమనార్హం.