మొయిన్ అలీకి క్రికెట్ నచ్చకపోతే సిరియా వెళ్లి ఐసిస్ లో చేరాలి: తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు
- ఐపీఎల్ లో చెన్నై జట్టుకు ఆడుతున్న మొయిన్ అలీ
- జెర్సీపై మద్యం కంపెనీ లోగో
- ఇస్లాం విశ్వాసాలకు వ్యతిరేకం అంటూ జెర్సీ వేసుకునేందుకు నిరాకరణ
- కొత్త జెర్సీ ఇచ్చిన చెన్నై ఫ్రాంచైజీ
- వ్యంగ్యంగా స్పందించిన తస్లీమా నస్రీన్
వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ మరోసారి తన వ్యాఖ్యలతో కలకలం రేపారు. ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా తనకు అందించిన జెర్సీలపై మద్యం కంపెనీ లోగోలు ఉండడంతో ఆ జెర్సీలను తాను ధరించలేనని, లోగోలు లేని జెర్సీలు ఇవ్వాలని మొయిన్ అలీ విజ్ఞప్తి చేశాడు. మద్యపానం ఇస్లాం విశ్వాసాలకు వ్యతిరేకమని చెప్పాడు. అందుకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. మద్యం కంపెనీ లోగోలు లేని కొత్త జెర్సీలు అందించింది. అయితే దీనిపై తస్లీమా నస్రీన్ విమర్శనాత్మకంగా స్పందించారు.
మొయిన్ అలీకి ప్రస్తుత క్రికెట్ నచ్చకపోతే సిరియా వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరాలని వ్యంగ్యం ప్రదర్శించారు. దాంతో తస్లీమాపై విమర్శలు వెల్లువెత్తాయి. భిన్న రంగాలకు చెందినవారు ఆమెను తప్పుబడుతూ ట్వీట్లు చేశారు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా స్పందించాడు. "మీకేమైంది..?" అంటూనే "మీ పరిస్థితి ఏంబాగోలేదనుకుంటా" అని ట్వీట్ చేశాడు.
అయితే ఈ వ్యాఖ్యను తాను సరదాగానే చేశానని తస్లీమా రిప్లయ్ ఇవ్వడంతో... "సరదాగా చేశారా... అయితే ఎవరికి నవ్వు రావడంలేదని ఆర్చర్ బదులిచ్చాడు. "కనీసం మీకైనా నవ్వొస్తోందా? ఈ ట్వీట్ ను తొలగిస్తారని భావిస్తున్నాను" అంటూ స్పందించాడు.
ముస్లిం సమాజాన్ని తాను లౌకికత్వంతో నింపాలని ప్రయత్నిస్తుంటే అందుకు వ్యతిరేకించేవాళ్లే మొయిన్ అలీపై తన ట్వీట్ ను వివాదాస్పదం చేస్తున్నారని తస్లీమా వ్యాఖ్యానించారు. ఇస్లామిక్ మత మౌఢ్యాన్ని తాను ప్రశ్నిస్తుండడంతో తనను విమర్శిస్తున్నారని, ఈ మానవాళికి సంబంధించి అతిపెద్ద విషాదం ఏమిటంటే... మహిళోద్ధారకులుగా పేరుగాంచిన వామపక్ష వర్గీయులే ఇస్లామిక్ మహిళా వ్యతిరేకులకు మద్దతు పలుకుతున్నారని వెల్లడించారు. ఆపై తన ట్వీట్ ను తొలగించారు.