తిరుపతిలో కాంగ్రెస్‌ను గెలిపించి దోష నివారణ చేయండి: తులసిరెడ్డి
- కాంగ్రెస్ విజయం చారిత్రాత్మకం కావాలి
- వైసీపీ పేరును ఆ పార్టీ నాయకులే పలకరు
- చింతా మోహన్ ఎంతో అభివృద్ధి చేశారన్న తులసిరెడ్డి
ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై ఏపీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం మోదీ అని, చంద్రబాబు, జగన్‌లు రాహుకేతువులని మండిపడ్డారు.
తిరుపతి ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించి రాష్ట్రానికి దోష విముక్తి చేయాలని కోరారు. తిరుపతిలో కాంగ్రెస్ విజయం చారిత్రాత్మకం కావాలని అన్నారు. వైసీపీ పేరును ఆ పార్టీ నాయకులే పలకరన్న తులసిరెడ్డి అది కాంగ్రెస్ నకిలీ పార్టీ అని ఎద్దేవా చేశారు. తిరుపతి ఉప ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్‌కు ఎంతో అనుభవం ఉందని, ఆయన హయాంలో ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. కాబట్టి ఆయనను గెలిపించి మోదీ, జగన్, చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కోరారు.