ఎంపీటీసీ ఎన్నికల బరిలో గుంటూరు జిల్లా గంగడిపాలెం సర్పంచ్
- వైసీపీ తరపున గతేడాది ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్
- కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా
- ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన శివాజీ
గుంటూరు జిల్లా రేపల్లె మండలం గంగడిపాలెం సర్పంచ్ తిరుమలశెట్టి శివాజీ పరిషత్ ఎన్నికల బరిలో దిగారు. ఆయన కనుక ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే సర్పంచ్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. గతేడాది మార్చిలో ఎంపీటీసీ అభ్యర్థిగా వైసీపీ తరపున ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే, కరోనా నేపథ్యంలో అప్పట్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఆ తర్వాత నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో బరిలోకి దిగిన శివాజీ విజయం సాధించారు.
తాజాగా, అప్పట్లో ఎంపీటీసీ స్థానానికి దాఖలైన నామినేషన్ పత్రాలను పరిశీలించిన అధికారులు శివాజీ నామినేషన్‌ను ఆమోదించారు. దీంతో ఇప్పుడాయన ఈ ఎన్నికల బరిలోనూ ఉన్నట్టు అయింది. శివాజీ కనుక ఎంపీటీసీగా విజయం సాధిస్తే రెండు పదవుల్లో ఒక దానికి రాజీనామా చేయాల్సి ఉంటుందని ఎంపీడీవో సువార్త తెలిపారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం అనుమతితో ఖాళీ అయిన స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.