ఏపీలో గత 24 గంటల్లో 1,326 కరోనా పాజిటివ్ కేసులు
- ఏపీలో కరోనా విజృంభణ
- 10,710కి పెరిగిన యాక్టివ్ కేసుల సంఖ్య
- గత 24 గంటల్లో 30,678 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 282 కొత్త కేసులు
గతేడాది ఇదే సమయంలో కరోనా వ్యాప్తి తీరుతెన్నులు ఎలా ఉన్నాయో, ప్రస్తుత పరిస్థితులు కూడా అదే రీతిలో ఉన్నాయి. కొన్ని నెలల కిందట బాగా తగ్గిన కరోనా వ్యాప్తి మార్చి నుంచి వేగం అందుకుంది. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 10,710కి చేరింది. గడచిన 24 గంటల్లో 30,678 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,326 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 282 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 271, విశాఖ జిల్లాలో 222, నెల్లూరు జిల్లాలో 171, కృష్ణా జిల్లాలో 138 కేసులు నమోదయ్యాయి. అత్పల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 2 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 911 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,244కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,09,002 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,91,048 మంది కోలుకున్నారు.