భారీ నష్టాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- మార్కెట్లపై కరోనా మహమ్మారి ప్రభావం
- ఉదయం నుంచీ నష్టాలతోనే ట్రేడింగ్
- 870.51 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్
- నిఫ్టీకి 229.55 పాయింట్ల నష్టం
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర రూపు దాలుస్తున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ కుదుపుకు లోనయ్యాయి. నేడు ప్రభుత్వం విడుదల చేసిన కరోనా కేసుల కొత్త సంఖ్య లక్షను దాటడంతో మదుపుదారుల సెంటిమెంట్ దెబ్బతింది. దాంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడడంతో స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి.
ఈ రోజు ఉదయం మార్కెట్లు ప్రారంభమైన తొలిదశలోనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 1449 పాయింట్ల వరకు నష్టపోయింది. తర్వాత ఐటీ షేర్ల అండతో కాస్త కోలుకుని, చివరికి 870.51 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 49159.32 వద్ద.. 229.55 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 14637.55 వద్ద ముగిశాయి.
ఇక నేటి సెషన్ లో సెయిల్, డా.లాల్ పాత్ ల్యాబ్స్, ఇన్ఫో ఎడ్జ్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ తదితర కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించగా.. యునైటెడ్ బ్రేవరీ, కెనరా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిగొన్నాయి.