హౌసింగ్ లోన్లపై వడ్డీ రేట్లను సవరించిన ఎస్బీఐ

  • మార్చి 1న వడ్డీ రేట్లను 6.70 శాతానికి తగ్గించిన ఎస్ బీఐ
  • తాజాగా 25 బేసిస్ పాయింట్ల పెంపు
  • 6.95 శాతానికి చేరిన వడ్డీ రేటు
  • ఏప్రిల్ 1 నుంచి అమలు
  • ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ అదనం
మార్చి 1న గృహ రుణాలపై వడ్డీ రేట్లను 6.70 శాతానికి తగ్గించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) మరోసారి సవరణ చేపట్టింది. గృహ రుణాలపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ తాజా ప్రకటన చేసింది. దాంతో హౌసింగ్ లోన్లపై వడ్డీ రేటు తాజా సవరణతో కలిపి 6.95 శాతానికి పెరిగింది.

ఈ సవరించిన వడ్డీ రేటు ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది. ఇదే కాకుండా గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు రుణ పరిధిని అనుసరించి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఉండనుంది. గృహ రుణాలపై  జీఎస్టీ కూడా విధించనున్నారు.


More Telugu News