సినీ కార్మికులకు, వారి కుటుంబాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తాం: చిరంజీవి
- వైల్డ్ డాగ్ సక్సెస్ మీట్ కు హాజరైన చిరంజీవి
- గతేడాది కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేశామని వెల్లడి
- ఎంతోమంది సినీ కార్మికులకు సాయపడ్డామని వివరణ
- అందులో కొంతమేర నిధులు మిగిలున్నాయన్న చిరు
- ఆ నిధులతో ఉచితంగా వ్యాక్సిన్ ఇప్పిస్తామని స్పష్టీకరణ
అక్కినేని నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' చిత్రం సక్సెస్ మీట్ లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమ కార్మికులకు కరోనా వ్యాక్సిన్లు ఇప్పించే అంశాన్ని ప్రస్తావించారు. సినీ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇప్పించాలన్న ఆలోచన వచ్చిందని, త్వరలోనే కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు.
కరోనా మహమ్మారి సంక్షోభం సృష్టించిన నేపథ్యంలో టాలీవుడ్ లో కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేశామని, చాలామంది కార్మికులకు సాయం చేయగా ఇంకా కొంతమేర నిధులు మిగిలున్నాయని చిరంజీవి తెలిపారు. ఇప్పుడా నిధులను ఉపయోగించి కార్మికులకు వ్యాక్సిన్ ఇప్పిస్తామని వివరించారు.