ఇది 21వ శతాబ్దం... ఏ ఒక్క భారత జవాను కూడా రక్షణ కవచం లేకుండా శత్రువును ఎదుర్కోకూడదు: రాహుల్ గాంధీ

  • చత్తీస్ గఢ్ లో భీకర దాడి
  • 22 మంది భద్రతా సిబ్బంది మృతి
  • జవాన్లకు శరీర కవచాలు అవసరమన్న రాహుల్ గాంధీ
  • సీఆర్పీఎఫ్ చీఫ్ ప్రకటనపై అసంతృప్తి
చత్తీస్ గఢ్ లో మావోయిస్టుల దాడిలో 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడంపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఇది 21వ శతాబ్దం, ఏ ఒక్క భారత జవాను కూడా శరీర రక్షణ కవచం లేకుండా శత్రువును ఎదుర్కోరాదని స్పష్టం చేశారు. శరీర రక్షణ కవచాలను ప్రతి ఒక్క సైనికుడికి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

అంతకుముందు ఆయన మరో ట్వీట్ లో సీఆర్పీఎఫ్ చీఫ్ కుల్దీప్ సింగ్ ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చత్తీస్ గఢ్ ఘటనలో ఎలాంటి ఇంటెలిజెన్స్ వైఫల్యం లేదని కుల్దీప్ అన్నారు. 25 నుంచి 30 మంది వరకు మావోయిస్టులు హతమై ఉంటారని పేర్కొన్నారు.

దీనిపై రాహుల్ స్పందిస్తూ, ఒకవేళ ఇంటెలిజెన్స్ వైఫల్యం లేకపోతే 1:1 నిష్పత్తిలో ఇరువైపులా మరణాలు చోటు చేసుకోవడాన్ని బట్టి సదరు ఆపరేషన్ లోపభూయిష్టంగానూ, అసమర్థంగానూ చేపట్టారని అర్థమవుతోంది అని వ్యాఖ్యానించారు. 'మన జవాన్లను అతి తేలిగ్గా ఫిరంగి గుళ్లకు బలి చేయడం ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదు' అని రాహుల్ అభిప్రాయపడ్డారు.


More Telugu News