తిరుపతి ఉప ఎన్నికలో నవతరం పార్టీ అభ్యర్థికి గాజుగ్లాసు గుర్తు... ఓట్లు చీలే అవకాశం ఉందని భావిస్తున్న బీజేపీ!
- తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక
- బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్న జనసేన
- నవతరం పార్టీ తరఫున గోదా రమేశ్ కుమార్ పోటీ
- రమేశ్ కు గాజు గ్లాసు గుర్తు కేటాయించిన ఈసీ
తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక బరిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేశ్ కుమార్ కు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. వాస్తవానికి గాజు గ్లాసు గుర్తు జనసేన పార్టీ చిహ్నం. తిరుపతి ఉప ఎన్నికలో జనసేన తన అభ్యర్థిని నిలపకుండా బీజేపీకి మద్దతిస్తోంది.
అయితే, నవతరం పార్టీకి గాజు గ్లాసు గుర్తు లభించడంతో, ఓటర్లు జనసేన అనుకుని గాజు గ్లాసు గుర్తుపై ఓటేసే అవకాశం ఉందని, తద్వారా ఓట్లు చీలతాయని బీజేపీ వర్గాల్లో ఆందోళన కలుగుతోంది. పవన్ కల్యాణ్ సైతం తిరుపతిలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు ప్రచారం చేస్తుండగా, ఈ గాజు గ్లాసు గుర్తు కమలనాథుల్లో కలవరం రేకెత్తిస్తోంది.