ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ అప్డేట్: 22 మంది జవాన్లు బలి
- మరో జవాను మృతదేహం కోసం గాలింపు
- సీఆర్పీఎఫ్ అధికారుల ప్రకటన
- భీతావహంగా అటవీ ప్రాంతం
- జవాన్ల త్యాగాన్ని వృథా కానివ్వమన్న ఛత్తీస్ గఢ్ సీఎం
- జవాన్ల మృతిపై రాష్ట్రపతి విచారం
ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన జవాన్ల సంఖ్య పెరుగుతోంది. తొలుత ఐదుగురు జవాన్లే చనిపోయారని అధికారులు ప్రకటించినా.. ఆదివారం మధ్యాహ్నం నాటికి వారి సంఖ్య 22కి పెరిగింది. ఈ మేరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అధికారులు ప్రకటించారు. మరో జవాను మృతదేహం కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. ఛత్తీస్ గఢ్ లోని సుక్మా–బీజాపూర్ సరిహద్దుల్లో శనివారం భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే.
ఆపరేషన్ లో మొత్తం 32 మంది జవాన్లు గాయపడినట్టు చెప్పారు. భద్రతా సిబ్బంది నుంచి నక్సలైట్లు భారీగా ఆయుధాలను దోచుకెళ్లారని వెల్లడించారు. కాగా, చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో అటవీ ప్రాంతమంతా భీతావహంగా మారింది. కాగా, మావోయిస్టులూ భారీగానే హతమైనట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, కాల్పుల్లో చనిపోయిన జవాన్ల త్యాగాన్ని వృథా కానివ్వబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బాఘల్ అన్నారు.
కాగా, జవాన్ల మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. వారికి నివాళులు అర్పించారు. మావోయిస్టులతో పోరాడుతూ జవాన్లు చనిపోయారన్న వార్త కలచివేసిందన్నారు. వారి త్యాగాన్ని దేశ ప్రజలెన్నడూ మరచిపోరన్నారు. చనిపోయిన జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.