చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్... ఐదుగురు భద్రతా సిబ్బంది మృతి

  • చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్
  • సుక్మా-బిజాపూర్ అటవీప్రాంతంలో కూంబింగ్
  • పోలీసుల రాకతో అప్రమత్తమైన నక్సల్స్
  • ఇరు వర్గాల మధ్య భారీగా కాల్పులు
  • ఇద్దరు నక్సల్స్ కూడా మరణించినట్టు అనుమానం
దేశంలో మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో చత్తీస్ గఢ్ ఒకటి. తాజాగా రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. బిజాపూర్ అటవీప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. బిజాపూర్-సుక్మా అటవీప్రాంతంలో భద్రతా బలగాలు యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహించాయి. పోలీసుల రాకతో అప్రమత్తమైన మావోలు కాల్పులు జరపడంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో భద్రతాబలగాల వైపు ప్రాణనష్టం అధికంగా ఉంది. ఐదుగురు జవాన్లు మృతి చెందగా, మరికొందరు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోలు మృతి చెందినట్టు భావిస్తున్నా, దీనిపై స్పష్టత లేదు. కాగా, మావోల ఉనికి వెల్లడి కావడంతో ఈ ప్రాంతానికి భారీగా అదనపు బలగాలను తరలిస్తున్నారు.


More Telugu News