విజయసాయికి దొంగ లెక్కల జ్ఞానం తప్ప చరిత్ర జ్ఞానం ఎక్కడుంది?: చినరాజప్ప
- పరిషత్ ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ
- ప్రజలే చంద్రబాబును బహిష్కరించారన్న విజయసాయి
- జ్యోతిబసు, జయలలిత కూడా ఎన్నికలు బహిష్కరించారన్న చినరాజప్ప
- ఆ తర్వాత వాళ్లు సీఎంలు అయ్యారని వెల్లడి
- ఈ విషయం ఏ2కి తెలియదా? అంటూ విమర్శలు
ఏపీ పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించిన నేపథ్యంలో.... చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించాడా? లేక ఏపీ ప్రజలే చంద్రబాబును బహిష్కరించారా? అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. జనం మెచ్చిన నాయకుడు ఎవరో, వెన్నుపోటుదారుడెవరో అందరికీ తెలుసని పేర్కొన్నారు. విజయసాయి వ్యాఖ్యలపై టీడీపీ నేత చినరాజప్ప స్పందించారు.
గతంలో జయలలిత, జ్యోతిబసు వంటి నేతలు కూడా ఎన్నికలను బహిష్కరించారని, కాలక్రమంలో వాళ్లు తమ కార్యకర్తలను కాపాడుకుని సీఎం అయ్యారన్న విషయం ఏ2 విజయసాయిరెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. మీ ఏ1 కూడా అసెంబ్లీని రెండేళ్లు బహిష్కరించిన విషయం మరిచారా? అని నిలదీశారు. విజయసాయికి దొంగ లెక్కల జ్ఞానం తప్ప చరిత్ర జ్ఞానం ఎక్కడుందని చినరాజప్ప ఎద్దేవా చేశారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి ప్రజాస్వామ్య విలువలు ఏం తెలుసని అన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో దొంగ, పోలీసు ఒక్కటయ్యారని విమర్శించారు.