'ఆచార్య'లో మణిశర్మ బాణీలు ఆహా అనిపిస్తాయట!
- 'ఆచార్య'లో ఐదు పాటలు
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
- ఊపేస్తున్న లాహే లాహే సాంగ్
టాలీవుడ్ లోని అగ్ర సంగీత దర్శకులలో మణిశర్మ ఒకరు. మణిశర్మ ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు. మెలోడీ .. ఫాస్టుబీట్ .. జానపదం .. ఇలా ఏ తరహా బాణీనైనా ఆయన అద్భుతంగా కంపోజ్ చేస్తారు. బాణీలను కంపోజ్ చేసే సమయంలో ఆయన ఆయా హీరోల బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుంటారు. అందువల్లనే ఆయన పాటల్లో హిట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి మణిశర్మ ఒకానొక దశలో ఒక అడుగు వెనక్కు వెళ్లినట్టుగా కనిపించినప్పటికీ, 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో తిరిగి ఆయన బిజీ అయ్యారు. ఆ సినిమా సంచలన విషయాన్ని సాధించడంలో పాటలు ప్రధానమైన పాత్రను పోషించాయి.
చిరంజీవి తాజా చిత్రమైన 'ఆచార్య'కు కూడా మణిశర్మనే సంగీతాన్ని అందించారు. తన విజయవంతమైన చిత్రాలకు సూపర్ హిట్ సాంగ్స్ ను జతచేసిన మణిశర్మ అంటే చిరంజీవికి ఎంతో నమ్మకం. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. అలా మ్యూజికల్ హిట్ గా నిలిచిన చిరూ చిత్రాల జాబితాలో 'ఆచార్య' నిలవడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉంటాయట. 4 పాటలు ఉత్సాహభరితంగా సాగితే, మరో పాట ఉద్వేగభరితంగా సాగుతుందని అంటున్నారు. చిరూ లాహే .. లాహే పాటకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. చరణ్ - పూజా హెగ్డే డ్యూయెట్ .. రెజీనా ఐటమ్ సాంగ్ కూడా ఒక రేంజ్ లో యూత్ ను ఊపేస్తాయని చెబుతున్నారు. మొత్తానికి మణిశర్మ మాయాజాలం ఆచార్యను అఖండ విజయం దిశగా నడిపిస్తుందనేది అభిమానుల మాట