ఈ చేపలు సైనేడ్ కన్నా విషపూరితం!
- దక్షిణాఫ్రికా బీచ్ లో వందలాదిగా చచ్చిపోయిన పఫర్ ఫిష్
- టెట్రొడోటాక్సిన్ అనే విషంతో క్షణాల్లోనే మరణం
- ప్రజలెవరూ బీచ్ వైపు వెళ్లొద్దని హెచ్చరిక
రత్నగర్భ అని సంద్రాలకు పేరు. విలువైన రాళ్లు, వైఢూర్యాలు, నిధి సంపదకు అవి నెలవు. అవే కాదు.. అందమైన ప్రాణులకూ ఆలవాలం. ఆ అందం చాటునే ప్రాణం తోడేసే ప్రమాదమూ పొంచి ఉంటుంది. అలాంటివే ఈ చేపలు. నోట్లో వేసుకుని రుచి చెప్పే లోపే చంపేస్తుందంటారు సైనేడ్ గురించి తెలిసినవాళ్లు. అయితే, ఆ సైనేడ్ కన్నా విషపూరితమీ చేపలు అంటున్నారు శాస్త్రవేత్తలు.
అవును, దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో సముద్రపు ఒడ్డుకు ఆ చేపలు కొట్టుకువచ్చాయి. చచ్చి పడిపోయాయి. ఇటీవల తన కుటుంబంతో కలిసి అక్కడకు వెళ్లిన బ్రిటన్ శాస్త్రవేత్త డాక్టర్ టెస్ గ్రిడ్లీకి ఆ చేపలు కనిపించాయి. వాటిని చూసిన ఆమె వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. వాటిని పరిశీలించిన దక్షిణాఫ్రికా పర్యావరణ, అటవీ శాఖ నిపుణులు.. అవి అత్యంత విషపూరితమైన రాక్షసి కళ్ల ‘పఫర్ ఫిష్’ అని గుర్తించారు.
ఫాల్స్ బేలో కుప్పలుతెప్పలుగా పడి ఉన్న ఆ చేపలు.. సైనేడ్ కన్నా విషపూరితమైనవని హెచ్చరించారు. ఆ చేపల్లోని ‘టెట్రొడోటాక్సిన్’ అనే నరాల సంబంధిత విషం.. క్షణాల్లోనే ప్రాణాలను హరించి వేస్తుందని చెప్పారు. దాంతో ఛాతీ, పొట్టను వేరు చేసే ఊపిరితిత్తుల వద్ద ఉండే కండరం దెబ్బతింటుందని చెబుతున్నారు. స్థానికులెవరూ ఆ బీచ్ వద్దకు వెళ్లొద్దని, ఆ చేపలను ముట్టుకోవద్దని, తినకూడదని అధికారులు హెచ్చరించారు.
ఇప్పటికే ఆ పఫర్ ఫిష్ ను తిని ఓ కుక్క చనిపోయిందని ఆఫ్రి ఓషన్స్ కన్జర్వేషన్ అలయన్స్ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. సీ సెర్చ్ ఆర్గనైజేషన్ తరఫున సముద్ర జీవాలపై పరిశోధనలు చేస్తున్న టెస్ గ్రిడ్లీ.. బీచ్ లో పడి ఉన్న ఆ చేపల వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. కాగా, కిలోమీటర్ కు 300 నుంచి 400 దాకా చేపలు చచ్చిపోయి పడి ఉన్నట్టు చెబుతున్నారు.