ఈ తీరు ఎన్నికల నిబంధనలకు విరుద్ధం: సోము వీర్రాజు

  • రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది
  • సర్పంచుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం స‌రికాదు
  • అధికార దుర్వినియోగానికి ఇది ఒక ఉదాహరణ
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ తీరుపై బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు విమ‌ర్శ‌లు గుప్పించారు. 'రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్ల తేదీల‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేప‌థ్యంలో గ్రామాల్లో, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండ‌గా రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను, పంచాయతీ బోర్డు మెంబర్లను ప్రమాణస్వీకారం చేయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం' అని సోము వీర్రాజు చెప్పారు.
 
'ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా పంచాయతీ పాలకవర్గ సమావేశం, సర్పంచుల పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం 3వ తేదీన ఏ విధంగా నిర్వహిస్తారు? పంచాయతీ కార్యవర్గ పదవీ బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం 3వ తేదీన ఏర్పాటు చేసి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ కి ముందుగానే నోటిఫికేషన్ ఏవిధంగా జారీ చేస్తారు?' అని సోము వీర్రాజు ప్ర‌శ్నించారు.

'ఇది కోడ్ ఉల్లంఘన కాదా? ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి ఇది ఒక ఉదాహరణ. ఈ సందర్భంలో రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశం కానీ నిర్వర్తించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. వెంటనే నిలుపుదల చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ ని బీజేపీ ఏపీ శాఖ‌ డిమాండ్ చేస్తుంది' అని సోము వీర్రాజు ట్వీట్లు చేశారు.


More Telugu News