శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. అగ్నికి ఆహుతవుతున్న వన్యప్రాణులు
- రెండు రోజుల క్రితం శేషాచలంలో రాజుకున్న నిప్పు
- మాడి మసవుతున్న వందలాది ఎకరాలు
- తిరుపతి వైపునకు మంటలు
శేషాచలం అడవుల్లో రెండు రోజుల క్రితం అంటుకున్న మంటలు శరవేగంగా వ్యాపిస్తూ వందలాది ఎకరాలను మాడ్చి మసిచేస్తున్నాయి. గురువారం మంగళం అటవీ ప్రాంతంలోని అవ్వారికోనలో ప్రారంభమైన మంటలు కరకంబాడి వైపునకు దాదాపు 5 కిలోమీటర్ల మేర విస్తరించాయి. నిన్న తిరుపతి వైపునకు కూడా వ్యాపించడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. మంటలు కాలనీ వైపునకు రాకుండా అదుపు చేసిన టీటీడీ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
మరోవైపు, కార్చిచ్చు కారణంగా అరుదైన వృక్షాలు కాలి బూడిద కాగా, వన్యప్రాణులు కూడా పెద్ద ఎత్తున మరణించి ఉంటాయని భావిస్తున్నారు. మరోపక్క, కార్చిచ్చు కారణంగా గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం మాచాయపాలెం శివారులోని కోనంకి అటవీ బీట్‌లో నిన్న వ్యాపించిన మంటల కారణంగా వంద ఎకరాలకు పైగా అడవి దగ్ధమైంది.