ఎన్నికల బహిష్కరణ నిర్ణయంపై టీడీపీలో నిరసన గళం.... ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన జ్యోతుల నెహ్రూ
- పరిషత్ ఎన్నికలు బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం
- ప్రకటన చేసిన చంద్రబాబు
- పార్టీ నిర్ణయం నిరాశకు గురిచేసిందన్న జ్యోతుల నెహ్రూ
- అందుకే తప్పుకుంటున్నట్టు వివరణ
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించడంపై ఆ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
పరిషత్ ఎన్నికలను బాయ్ కాట్ చేయాలన్న పార్టీ నిర్ణయం తనను నిరాశకు గురిచేసిందని జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. అందుకే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నానని వివరించారు. అయితే, తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట టీడీపీ ఇన్చార్జిగా కొనసాగుతానని స్పష్టం చేశారు.
జ్యోతుల నెహ్రూ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. అంతకుముందు 2014లో వైసీపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 1994, 1999లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.