రికార్డు స్థాయిలో 'వకీల్ సాబ్' రిలీజ్

  • 'పింక్' రీమేక్ గా 'వకీల్ సాబ్'
  • చాలా గ్యాప్ తరువాత పవన్ రీ ఎంట్రీ  
  • ఈ నెల 9వ తేదీన విడుదల

అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ వస్తుందన్నట్టుగా సందడిచేసే అభిమానులు, రాజకీయాల కారణంగా ఆయన గ్యాప్ ఇవ్వడంతో దిగాలుపడిపోయారు. 'వకీల్ సాబ్' సినిమాతో మళ్లీ ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నారు. హిందీలో సూపర్ హిట్ ను నమోదు చేసిన 'పింక్' సినిమాకి ఇది రీమేక్. ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

బోనీకపూర్ సమర్పణలో దిల్ రాజు - శిరీష్ కలిసి నిర్మించిన ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న కారణంగానే వేణు శ్రీరామ్ కి పవన్ ఛాన్స్ ఇచ్చారు. ఓవర్సీస్ లో 700 స్క్రీన్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆస్ట్రేలియా .. న్యూజిలాండ్ లలో అత్యధిక స్క్రీన్ లలో విడుదలయ్యే తెలుగు సినిమా ఇదేనని అంటున్నారు. అంజలి .. నివేదా థామస్ .. అనన్య ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, శ్రుతి హాసన్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాతో పవన్ కొత్త రికార్డులకు తెరతీస్తూ వెళతాడేమో చూడాలి.



More Telugu News