అసోంలో బీజేపీ అభ్యర్థి కారులో ఈవీఎం తరలింపు.. ఆ స్థానంలో రీపోలింగ్!
- కారుపై ప్రతిపక్ష నేతల రాళ్లదాడి
- ఘటనపై ఎన్నికల సంఘం నిజ నిర్ధారణ నివేదిక
- స్ట్రాంగ్ రూంకు వెళుతుండగా కారు బ్రేక్ డౌన్
- వేరే కారులో లిఫ్ట్ అడిగి వెళ్లిన పోలింగ్ సిబ్బంది
- అది బీజేపీ అభ్యర్థిదని తెలియదని కామెంట్
పోలింగ్ అయిపోయాక ఈవీఎంలను అధికారిక వాహనంలో తీసుకెళ్లాలి. కానీ, ఓ బీజేపీ అభ్యర్థి కారులో తీసుకెళ్లడం ఇప్పుడు అసోంలో సంచలనం సృష్టిస్తోంది. ఈవీఎంలను బీజేపీ అభ్యర్థి కారులో తీసుకెళ్తుండడాన్ని గుర్తించిన ప్రతిపక్ష నేతలు.. వెంటనే కారును ఆపి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ రీపోలింగ్ కు ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఈ ఘటన అసోంలోని కరీంగంజ్ లోని రాతాబరీ నియోజకవర్గంలో జరిగింది. బీజేపీ అభ్యర్థి కృష్ణేందు పాల్ భార్య పేరిట ఉన్న ఆ కారును అడ్డుకున్న ప్రతిపక్ష సభ్యులు.. ఆందోళనలకు దిగారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఎన్నికల్లో అధికార బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు.
దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం.. నిజనిర్ధారణ నివేదికను విడుదల చేసింది. ఘటనకు బాధ్యులైన నలుగురు ఎన్నికల అధికారులపై వేటు వేసింది. ఘటనపై పూర్తి వివరాలను వెల్లడించింది. ఈవీఎంలను స్ట్రాంగ్ రూంకు తీసుకెళ్లే క్రమంలో ప్రభుత్వ కారు బ్రేక్ డౌన్ అయిందని, అప్పటికే వాతావరణం బాగాలేకపోవడం, ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండడంతో అటుగా వచ్చిన వాహనాన్ని లిఫ్ట్ అడిగి తీసుకున్నామని చెప్పింది.
గురువారం రాత్రి 9 గంటల సమయంలో నీలం బజార్ కు దగ్గర్లోనే వాహనం బ్రేక్ డౌన్ అయిందని పేర్కొంది. ఆ వాహనంలోని ఎన్నికల సిబ్బంది వెంటనే సెక్టార్ ఆఫీసర్ అజయ్ సూత్రధార్ కు ఫోన్ చేశారని, ఆయన వాహనం ఏర్పాటు చేసే లోపే అటుగా వస్తున్న వాహనాన్ని అధికారులు లిఫ్ట్ అడిగారని చెప్పింది. ఆ వాహనం ఎవరిదో తెలియకుండానే అధికారులు ఆపారని, స్ట్రాంగ్ రూం వద్ద ప్రతిపక్ష కార్యకర్తలు ముట్టడించి దాడి చేసినప్పుడే ఆ కారు బీజేపీ అభ్యర్థి కృష్ణేందు పాల్ భార్య మధుమిత పాల్ దిగా తెలిసిందని వెల్లడించింది.
రాత్రి 10 గంటలకు కనైశిల్ కు చేరుకున్న తర్వాత.. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో వాహనం ట్రాఫిక్ లో ఆగిందని, అప్పుడే 50 మంది దాకా గుంపుగా వచ్చి కారుపై రాళ్లతో దాడి చేశారని చెప్పింది. ఆ వాహనం బీజేపీ నేతదని ఆ గుంపుకు నాయకుడు చెప్పాడని తెలిపింది. అప్పుడే అది బీజేపీ అభ్యర్థి కారని తెలిసిందని చెప్పింది. వారు హింసకు పాల్పడి దాడి చేయడంతో కరీంగంజ్ ఎస్పీకి గాయాలయ్యాయని తెలిపింది. పోలింగ్ ప్రొటోకాల్ ను ఉల్లంఘించినందుకు పోలింగ్ అధికారి సహా నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశామని వెల్లడించింది.