ఎన్నికల బహిష్కరణ విషయాన్ని చంద్రబాబుకే వదిలేసిన టీడీపీ పొలిట్‌బ్యూరో
- ముగిసిన పొలిట్ బ్యూరో సమావేశం
- పోటీకి దింపిన అభ్యర్థుల విషయంపై చర్చ
- త్వరలోనే అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించనున్న చంద్రబాబు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనే అంశంపై చర్చించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా ఆ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీకి దింపిన అభ్యర్థుల విషయంతో పాటు పలు అంశాలపై ఇందులో చర్చించారు. ఎన్నికలు బహిష్కరించాలనే మెజార్టీ నేతలు సూచనలు చేశారు. చివరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బహిష్కరణపై నిర్ణయాన్ని తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికే టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వదిలేశారు.
పరిషత్ ఎన్నికలపై నేతల నుంచి పూర్తి స్థాయిలో అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు.. ఎన్నికల్లో తమ పార్టీ పోటీపై త్వరలోనే అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటానని, మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు.