దాగుడుమూతలు ఆడుతూ గడ్డివాములోకి దూరిన ఇద్దరు చిన్నారులు.. మంటలు అంటుకుని మృతి
- మహబూబ్ నగర్ జిల్లా ఇప్పటూరులో ఘటన
- చిన్నారులు విగ్నేశ్, ప్రశాంత్ మృతి
- వారి స్నేహితుడే అనాలోచితంగా నిప్పుపెట్టాడని అనుమానం
ఇంటి సమీపంలో దాగుడుమూతలు ఆడుకుంటూ తమ మరో స్నేహితుడికి కనపడకుండా గడ్డివాములోకి దూరారు ఇద్దరు చిన్నారులు. ఇంతలో ఆ గడ్డివాముకి నిప్పు అంటుకోవడంతో ఆ ఇద్దరు చిన్నారులకు మంటలు అంటుకుని ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని నవాబుపేట మండలం ఇప్పటూరు గ్రామంలో చోటుచేసుకుంది. విగ్నేశ్, ప్రశాంత్ అనే ఇద్దరు చిన్నారులు తమ స్నేహితుడు శివతో కలిసి ఓ గడ్డివాము వద్ద ఆడుకున్నారు.
విగ్నేశ్, ప్రశాంత్ ఇద్దరూ వెళ్లి గడ్డివాములోకి దూరి శివకు కనపడకుండా దాక్కున్నారు. అదే సమయంలో దానికి నిప్పు అంటుకోవడం గమనార్హం. స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి ఇద్దరు చిన్నారులను ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విగ్నేశ్, ప్రశాంత్ ప్రాణాలు కోల్పోయారు. ఇంతటి ప్రమాదం జరుగుతుందని ఊహించకుండా వారి స్నేహితుడు శివే గడ్డివాముకు నిప్పు అంటించి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు.