సైన్యం కోసం అతి తక్కువ బరువుండే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్.. అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో
- డీఆర్‌డీవోకు చెందిన కాన్పూరు ప్రయోగశాలలో అభివృద్ది
- 9 కిలోలకు తగ్గిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ బరువు
- నాణ్యతా ప్రమాణాల్లో పాస్
భారత సైన్యం కోసం తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అందుబాటులోకి తీసుకురావాలన్న డీఆర్‌డీవో కృషి ఫలించింది. అత్యుత్తమ నాణ్యతతో, 9 కేజీల బరువు ఉండే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన కాన్పూరులోని ప్రయోగశాల అభివృద్ధి చేసింది.
ఫ్రంట్‌హార్డ్ ఆర్మర్ ప్యానెల్ (ఎఫ్‌హెచ్ఏపీ) జాకెట్‌గా పిలిచే దీనిని చండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ లేబొరేటరీలో పరీక్షించి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్టు తేల్చారు. అత్యాధునిక సాంకేతికత, ప్రత్యేకమైన మెటీరియల్స్ వాడడం వల్ల గతంలో 10.4 కేజీల బరువుండే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇప్పుడు 9 కిలోలకు తగ్గినట్టు అధికారులు తెలిపారు.
గతంలో డీఆర్‌డీవో ద్రవంతో నిండిన స్పెషల్ జాకెట్లను అభివృద్ధి చేసింది. వీటిని ధరించిన వారు వేడిని తట్టుకోగలుగుతారు. జోధ్‌పూర్ ఆరోగ్య శాఖ గతేడాది జులైలో ల్యాబ్ టెక్నీషియన్లకు వీటిని అందజేసింది. అలాగే, ఇండియన్ ఆర్మీలో మేజర్ ర్యాంకు అధికారి అనూప్ మిశ్రా ఈ ఏడాది జనవరిలో స్త్రీ, పురుషులు ధరించగలిగే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ‘శక్తి’ని అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి ఫ్లెక్సిబుల్ బాడీ ఆర్మర్ కావడం విశేషం.