పింగళికి భారతరత్నపై అప్పుడేం చేశావు చంద్రబాబూ?: విజయసాయిరెడ్డి విసుర్లు
- మువ్వన్నెల జెండాకు వందేళ్లు
- పింగళిని స్మరించుకున్న నేతలు
- భారతరత్న ఇవ్వాలంటూ చంద్రబాబు డిమాండ్
- సీఎం జగన్ ఎప్పుడో లేఖ రాశారన్న విజయసాయి
భారత త్రివర్ణ పతాకం రూపుదిద్దుకుని 100 ఏళ్లయిన సందర్భంగా జెండా రూపశిల్పి పింగళి వెంకయ్యను స్మరించుకోవడం తెలిసిందే. పింగళికి భారతరత్న ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేయగా, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. పింగళికి భారతరత్న ఇవ్వాలంటూ చంద్రబాబు తెగ హడావిడి చేస్తున్నాడని విమర్శించారు.
"ఢిల్లీలో చక్రం తిప్పానంటావ్... మరి అప్పుడేం చేశావు చంద్రబాబూ!" అని నిలదీశారు. మూడు వారాల కిందటే పింగళి కుమార్తె ఇంటికి సీఎం జగన్ స్వయంగా వెళ్లి ఆర్థికసాయం అందించారని విజయసాయి గుర్తుచేశారు. పింగళికి భారతరత్న ఇవ్వాలంటూ ప్రధాని మోదీకి 20 రోజుల కిందటే లేఖ కూడా రాశారని వివరించారు.