ఏపీలో గత 24 గంటల్లో 1,271 పాజిటివ్ కేసుల నమోదు
- తాజాగా 31,809 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 285 కొత్త కేసులు
- ముగ్గురి మృతి.. కోలుకున్న వారు 464 మంది
- 8,142కి పెరిగిన యాక్టివ్ కేసుల సంఖ్య
ఏపీలో కొన్నాళ్ల పాటు నిదానించిన కరోనా రక్కసి మళ్లీ విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 31,809 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,271 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 285 కొత్త కేసులు వెల్లడయ్యాయి. గుంటూరు జిల్లాలో 279, విశాఖ జిల్లాలో 189 కేసులు, కృష్ణా జిల్లాలో 161 కేసులు గుర్తించారు. అదే సమయంలో 464 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు.
ఇక, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 9,03,260కి పెరిగింది. 8,87,898 మంది కరోనా ప్రభావం నుంచి కోలుకోగా, ఇంకా 8,142 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 7,220కి చేరింది.
ఇక, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 9,03,260కి పెరిగింది. 8,87,898 మంది కరోనా ప్రభావం నుంచి కోలుకోగా, ఇంకా 8,142 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 7,220కి చేరింది.