నేను కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాను... మీరు కూడా బాధ్యతగా ముందుకు రండి: సీఎం జగన్

  • 45 ఏళ్లకు పైబడిన వారికీ కరోనా వ్యాక్సిన్ 
  • గుంటూరులో వ్యాక్సిన్ తీసుకున్న సీఎం జగన్
  • ఏపీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించినట్టు వెల్లడి
ఏపీ సీఎం జగన్ ఇవాళ గుంటూరులో కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం తెలిసిందే. నగరంలోని భరత్ పేట వార్డు సచివాలయంలో సీఎం జగన్ సతీసమేతంగా విచ్చేసి తొలి డోసు వేయించుకున్నారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

గుంటూరులోని భరత్ పేట వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకోవడం ద్వారా ఏపీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించానని వెల్లడించారు. బాధ్యత గల పౌరులుగా ముందుకు రావాలని, కొవిడ్ రహిత ఆంధ్రప్రదేశ్ ను సాకారం చేయడంలో తనతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు. కేంద్రం ప్రకటించిన మేరకు ఏపీలోనూ 45 ఏళ్లకు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ అందించే కార్యక్రమం నేటి నుంచి అమలు చేస్తున్నారు. కాగా సీఎం జగన్ కు కరోనా వ్యాక్సిన్ వేస్తున్న సమయంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కూడా అక్కడే ఉన్నారు.


More Telugu News