మట్టివాసనలు ఉన్న సినిమా ఇది!: 'టక్ జగదీశ్' గురించి నాని
- బంధాలకు ..అనుబంధాలకు పెద్దపీట
- ఈ నెల 23వ తేదీన విడుదల
- అందరితో కలసి చూడాలని ఉందన్న నాని
టాలీవుడ్ లో కథలను ఎంపిక చేసుకునే విషయంలో చాలా కేర్ తీసుకునే హీరోల్లో నాని ముందువరుసలో కనిపిస్తాడు. కథ .. పాత్రలు .. సన్నివేశాలు, అభినయం అన్నీ కూడా సహజంగా ఉండేలా ఆయన చూసుకుంటాడు. అందువల్లనే అంతా ఆయనను నేచురల్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు.
ఇక తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి పనిచేయడం నానీకి అలవాటు. అలా తనకి 'నిన్నుకోరి' సినిమాతో హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఆయన 'టక్ జగదీశ్' సినిమా చేశాడు. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, నాని అన్నయ్య పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ కొంతసేపటి క్రితం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సినిమాను గురించి నాని మాట్లాడుతూ .. "నా కెరియర్లో నాకు చాలా సంతృప్తిని ఇచ్చిన సినిమా ఇది. ఫైనల్ కట్ చూసిన తరువాత, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని మా డైరెక్టర్ తో చెప్పాను. ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లకు వస్తుందా .. ఎప్పుడెప్పుడు అంతా థియేటర్స్ కి వస్తారా? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము.
గ్రామీణ నేపథ్యం .. బంధాలు, అనుబంధాలు .. మట్టివాసనలు ఉన్న సినిమా ఇది. కమర్షియల్ అంశాలను సహజత్వంతో కలిపి అందించే ప్రయత్నం చేశాము. విడుదల రోజున మీ అందరితో కలిసి ఈ సినిమా చూడాలని ఉత్సాహపడుతున్నాను. నా సినిమాతో పాటు ఈ వేసవిలో విడుదల కానున్న సినిమాలన్నీ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అని నాని చెప్పుకొచ్చాడు.