ఎన్డీయేకి మద్దతుగా పుదుచ్చేరిలో ప్రచారం చేస్తున్న ఈ వైసీపీ వారిని ఏమనాలి?: అయ్యన్న పాత్రుడు
- పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు
- పుదుచ్చేరిలో వైసీపీ నేతల ప్రచారం
- ప్రశ్నించిన అయ్యన్నపాత్రుడు
- ఏపీకి ప్రత్యేక హోదా అడిగే ధైర్యంలేదని విమర్శలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెబుతూనే, పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అయ్యన్న ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
"మన మెడలు వంచే ఉస్తాద్ ఇలాంటి పరిస్థితుల్లో ఏంచేయాలి? రాష్ట్ర ప్రజలందరి తరఫున పోరాటం చేయాలి" అని పేర్కొన్నారు. కానీ, జగన్ అలా చేయకుండా.... అదే పుదుచ్చేరిలో ఎన్డీయేకి మద్దతుగా తన మంత్రులను, ఎంపీలను పంపించాడని అయ్యన్న మండిపడ్డారు.
మన హక్కుగా దక్కాల్సిన ప్రత్యేక హోదా అడిగే ధైర్యం లేకపోగా, పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామంటున్నఎన్డీయే తరఫున ప్రచారం చేస్తున్న ఈ వైసీపీ వాళ్లను ఏమనాలి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహులు అనేది వీళ్లకు చాలా చిన్న పదం అని అయ్యన్నపాత్రుడు విమర్శించారు.