'ఆర్ఆర్ఆర్'ను ఉత్తరాదిలో రిలీజ్ చేసేది ఎవరంటే...!
- డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్న పెన్ మూవీస్
- అన్ని భాషల్లోనూ ఎలక్ట్రానిక్, డిజిటల్, శాటిలైట్ హక్కులు
- వెల్లడించిన డీవీవీ ఎంటర్ టైన్మెంట్, పెన్ మూవీస్
ఆర్ఆర్ఆర్ మూవీపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ చేస్తుండడం, స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే అల్లూరి, భీం టీజర్లను విడుదల చేసి ఆ అంచనాలను అమాంతం పెంచేశారు. తాజాగా రామ్ చరణ్ అల్లూరి పోస్టర్ ను విడుదల చేసి ఫ్యాన్స్ కు రెట్టింపు ఆనందాన్నిచ్చారు.
అయితే, తాజాగా సినిమా ఉత్తరాది హక్కులను ప్రముఖ సంస్థ పొందినట్టు ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్ టైన్మెంట్ ప్రకటించింది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ సినిమా హక్కులను కొనుగోలు చేసిందని వెల్లడించింది. డిస్ట్రిబ్యూషన్ హక్కులతో పాటు అన్ని భాషల్లోనూ ఎలక్ట్రానిక్, డిజిటల్ , శాటిలైట్ హక్కులను పెన్ మూవీస్ సొంతం చేసుకుందని తెలిపింది.
తెలుగు సినీ చరిత్రలోనే భారీ చిత్రమైన ఆర్ఆర్ఆర్ భారీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నామంటూ ట్వీట్ చేసింది. పెన్ మూవీస్ కూడా దీనిపై స్పందించింది. రాజమౌళి భారీ చిత్రాన్ని తాము ప్రెజెంట్ చేస్తుండడం చాలా గౌరవంగా, గర్వంగా ఉందని ట్వీట్ చేసింది. కాగా, సినిమాను దసరా పర్వదినాన విడుదల చేయాలని చిత్ర బృందం టార్గెట్ పెట్టుకుంది.