స్టాలిన్ ప్రధానమంత్రి కూడా అవుతారు: డీఎంకే నేత దురైమురుగన్ జోస్యం

  • వివిధ సంస్కృతులు, భాషలను రూపుమాపేలా కేంద్రం వ్యవహరిస్తోంది
  • కేంద్రం చర్యలను ఎదుర్కొనే నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు
  • స్టాలిన్ పదేళ్లు మాత్రమే సీఎంగా ఉంటారు
డీఎంకే సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో పదేళ్లలో తమ అధినేత స్టాలిన్ ప్రధాని అవుతారని ఆయన అన్నారు. కృష్ణగిరి జిల్లా బర్గూర్ నియోజకవర్గ అభ్యర్థి మధుసూదన్ కు మద్దతుగా నిర్వహించిన ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ఒకే దేశం, ఒకే భాష, ఒకే జాతి అనే లక్ష్యంతో కేంద్రం పాలన సాగిస్తోందని... వివిధ భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన దేశంలో వాటన్నింటినీ రూపుమాపేలా ప్రమాదకరంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను దీటుగా ఎదుర్కొనే నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని... అలాంటి నాయకుడు స్టాలిన్ అని అన్నారు. తాను చెప్పిన మాటలు రాసి పెట్టుకోవాలని... స్టాలిన్ కేవలం పదేళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటారని... ఆ తర్వాత ప్రధానమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.


More Telugu News