మద్యపాన నిషేధాన్ని అటకెక్కించినట్లేనా?: దేవినేని ఉమ

  • రోజు కష్టమంతా పీల్చేస్తున్న సర్కారీ మద్యం షాపులు
  • పథకాల పేరుతో వేసిన డబ్బులనూ గుంజుతున్న వైనం
  • రాష్ట్రంలో జోరుగా ఎన్డీపీ, నాటుసారా విక్రయాలు
  • నాసిరకం మద్యంతో పేదల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు
మ‌ద్య‌పాన నిషేధం విధిస్తామ‌ని ఎన్నిక‌ల ముందు చెప్పిన వైసీపీ ఇప్పుడు ఆ హామీని అట‌కెక్కించిన‌ట్లేనా? అని టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ప్ర‌శ్నించారు.
'మందుకే సగం కూలి' పేరుతో ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన ఓ క‌థ‌నాన్ని ఆయ‌న పోస్ట్ చేశారు.

 గతం కంటే క్వార్టర్ మందు సీసా‌ ఖర్చు రెట్టింపైంద‌ని అందులో పేర్కొన్నారు. గత ప్రభుత్వం పాల‌న‌లో రోజుకు రూ.వంద ఉండ‌గా, ప్రస్తుతం రూ.200 నుంచి 250 రూపాయ‌లుగా ఉంద‌ని చెప్పారు. పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం ప‌డుతోంద‌ని, సర్కారీ షాపుల్లో అన్నీ డబుల్‌ రేట్లు ఉన్నాయ‌ని చెప్పారు.

సగటున రోజువారీ కూలి రూ.400 అని, క్వార్టర్‌కు మించి తాగినరోజు కూలీలు పస్తులు ఉండాల్సిందేన‌ని చెప్పారు. అంత డ‌బ్బుపెట్టలేనివారంతా నాటు వైపు వెళ్తున్నార‌ని, జోరుగా ఎన్‌డీపీఎల్‌ అమ్మకాలు జ‌రుగుతున్నాయ‌ని అందులో వివ‌రించారు. ఈ విష‌యాల‌ను దేవినేని ఉమ ప్ర‌స్తావించారు.

'రోజు కష్టమంతా పీల్చేస్తున్న సర్కారీ మద్యం షాపులు. పథకాల పేరుతో వేసిన డబ్బులనూ గుంజుతున్న వైనం. రాష్ట్రంలో జోరుగా ఎన్డీపీ, నాటుసారా విక్రయాలు. నాసిరకం మద్యంతో పేదల ఆరోగ్యాన్ని పణంగాపెడుతూ, అస్మదీయుల జేబులు నింపుతున్న మీ ప్రభుత్వ వైఖరితో మద్యపాన నిషేధాన్ని అటకెక్కించినట్లేనా? వైఎస్ జ‌గ‌న్' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.


More Telugu News