పుదుచ్చేరిలో బీజేపీ మిత్రుల గెలుపు కోసం జగన్ విస్తృత ప్రచారం చేయిస్తున్నారు: లోకేశ్ విమర్శలు
- మోదీ మెడ వంచి జగన్ ప్రత్యేక హోదా తెస్తానన్నారు
- ప్రత్యేకహోదాని తాకట్టు పెట్టారు
- కమలంతో రహస్య ప్రయాణాన్ని కట్టిపెట్టేయండి
- ప్రత్యేకహోదా కోసం ఇప్పటికైనా గట్టిగా అడగండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ తాకట్టు పెట్టారని అన్నారు.
'మోదీ మెడ వంచి తెస్తానన్న ప్రత్యేకహోదాని తాకట్టు పెట్టిన ఫేక్ సీఎం గారూ! ఇప్పుడు బీజేపీ పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామంటోంది. ఏపీకి ముగిసిన అధ్యాయమైన ప్రత్యేకహోదా పుదుచ్చేరిలో ఎలా మొదలవుతుందో?' అని ప్రశ్నించారు.
'రాష్ట్రంలో కమలంతో రహస్య ప్రయాణాన్ని కట్టిపెట్టేసి, పుదుచ్చేరిలో బీజేపీ మిత్రుల గెలుపు కోసం వైకాపా నాయకులతో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు వైఎస్ జగన్. మీ కేసుల గురించి కాకుండా కాస్త ప్రత్యేకహోదా కోసం ఇప్పటికైనా గట్టిగా అడగండి' అని లోకేశ్ సూచించారు.
'గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ నియంతస్వామ్యంలోకి వెళ్లిపోతుంది. జీవో 2తో సర్పంచుల హక్కులు, అధికారాలకు కోత పెడుతున్నారు. ప్రభుత్వ దుర్మార్గపు నిర్ణయంతో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోనున్నారు' అని చెప్పారు.
'73వ రాజ్యాంగ సవరణ చట్టం కల్పించిన హక్కులపై జీవో 2తో వేటు వెయ్యడం రాజ్యాంగ ఉల్లంఘనే. సర్పంచుల హక్కులును కాలరాసే జీవో2ని వెంటనే రద్దు చేయాలి' అని డిమాండ్ చేశారు.