ఐపీఎల్ కోసం చెమటోడుస్తున్న ధోనీ, రైనా!
- ఈ నెల 9 నుంచి ఐపీఎల్ 14వ సీజన్
- తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్- రాయల్ చాలెంజర్స్
- వీడియో విడుదల చేసిన సీఎస్ కే
- కొత్త జోష్ తో సురేశ్ రైనా
చూస్తుండగానే ఐపీఎల్ వచ్చేసింది. ఏడాది తిరగకుండానే ఫ్యాన్స్ కు మజా పంచేందుకు రెడీ అవుతోంది. టైటిలే లక్ష్యంగా అన్ని జట్లూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఐదో టైటిల్ పట్టేసి హ్యాట్రిక్ కొట్టేయాలని ముంబై, మరో టైటిల్ కొట్టేయాలని చెన్నై, ఐపీఎల్ కెరీర్ లో ఫస్ట్ టైటిల్ అందించాలని కోహ్లీ పట్టుదలతో ఉన్నారు. ఇదంతా పక్కనపెట్టేస్తే.. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే) కప్పు సాధించే దిశగా కసరత్తులు మొదలు పెట్టేసింది.
నెట్స్ లో కెప్టెన్ ధోనీ, రైనా సహా మిగతా ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత ధోనీ, రైనాలు గ్రౌండ్ లోకి దిగారు. ఇద్దరూ జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో రైనా గత ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. కావాలనే రైనాను తప్పించారంటూ అప్పట్లో ఎన్నెన్నో ఆరోపణలు వినిపించాయి. అయితే, ఇప్పుడు మళ్లీ కొత్త జోష్ తో తాజా ఐపీఎల్ సీజన్ లో ఎంట్రీ ఇచ్చాడు రైనా. పీల్డింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ధోనీ కూడా తన బ్యాటుకు పదును పెడుతూ కనిపించాడు.
గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. టీమ్ ఐపీఎల్ కెరీర్ లో ఎన్నడూ లేనంతగా ఏడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐపీఎల్ 14వ సీజన్ ఈ నెల 9న చెన్నైలో మొదలుకానుంది. ఆరంభ మ్యాచ్ లో రోహిత్ కెప్టెన్సీలోని డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ను కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఢీకొనబోతోంది.