రజనీకాంత్ కు ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
- ట్విట్టర్ లో వెల్లడించిన ప్రకాశ్ జవదేకర్
- ఆయన సేవలు నిరుపమానం
- జ్యూరీకి ధన్యవాదాలన్న జావదేకర్
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా ప్రకటించారు.
"ఈ విషయాన్ని తెలియజేసేందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. భారత సినీ రంగంలోని అత్యున్నత నటుల్లో ఒకరైన రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నాం. ఓ నటుడిగా, నిర్మాతగా స్క్రీన్ రైటర్ గా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు నిరుపమానం. రజనీకాంత్ ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు నా ధన్యవాదాలు" అని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. రజనీకి అవార్డు దక్కడంపై పలువురు శుభాభినందనలు తెలుపుతున్నారు.