వంట గ్యాస్ సిలిండర్ ‌పై 10 రూపాయల తగ్గింపు

  • నేటి నుంచి 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 809 మాత్రమే
  • అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడమే కారణం
  • మున్ముందు మరింత తగ్గే అవకాశం
గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధర పది రూపాయలు తగ్గింది. అంతర్జాతీయంగా చమురు ధరలు దిగి వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. నేటి నుంచి 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 809  కానుంది.

ఆసియా, ఐరోపా దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండడం, దీనికి తోడు టీకా దుష్ప్రభావాలపై ఆందోళన కారణంగా గత నెల రెండో అర్ధభాగం నుంచి అంతర్జాతీయంగా చమురు ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో వారం రోజుల్లో పెట్రో ధరలు మూడుసార్లు స్వల్పంగా తగ్గాయి. కాగా, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పతనం అవుతుండడంతో మున్ముందు పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


More Telugu News