ఆ వీడియోలు నేనే తీసి స్నేహితులకు ఇచ్చాను: కర్ణాటక రాసలీలల కేసులో బాధితురాలు

  • విధాన సభకు వెళ్లగా మంత్రితో పరిచయం
  • రెండు మూడు సార్లు శారీరకంగా వాడుకున్నారు
  • సాక్ష్యంగా పనికొస్తాయని తానే వీడియోలు తీసుకున్నానన్న యువతి
కొంతకాలం క్రితం తాను విధానసభకు వెళ్లిన సమయంలో మంత్రి రమేశ్ జార్కిహోళి కలిశారని, ఆ సమయంలో ఆయన తన మొబైల్ నంబర్ ను ఇవ్వగా, దాన్ని 'మల్లేశ్వరి పీజీ' అని తన మొబైల్ లో సేవ్ చేసుకున్నానని, రాసలీలల సీడీలోని బాధిత యువతి సిట్ అధికారుల విచారణలో పేర్కొంది. నిన్న ఆమెను భారీ బందోబస్తు మధ్య బౌరిగ్ హాస్పిటల్ కు తీసుకెళ్లి, కరోనా పరీక్షలు చేయించి, నెగటివ్ వచ్చిందని తేల్చుకుని, ఆపై సిట్ ఆఫీసులో అధికారులు విచారించారు.

మంత్రి తనకు సహకరించాలని కోరారని, తమ ప్రాంతంలో బలమైన నేత కావడంతోనే ఏమీ చేయలేకపోయానని వెల్లడించిన ఆమె, రెండు మూడు సార్లు తనను ఆయన శారీరకంగా వాడుకున్నారని, ఎప్పటికైనా సాక్ష్యాలుగా పనికి వస్తాయన్న కోణంలో ఆలోచించి, తానే ఈ వీడియోలను తీశానని చెప్పారు. ఈ విషయాన్ని కన్న తల్లిదండ్రులకు కూడా చెప్పలేదని, అయితే, క్లాస్ మేట్ శ్రవణ్ అనే వ్యక్తికి, నరేశ్ అనే మరో స్నేహితుడికి ఇచ్చానని, ఇంకో కాపీని దాచుకున్నానని ఆమె పేర్కొంది.


More Telugu News