అమెరికాలోని పాఠశాలకు భారతీయ అమెరికన్ పేరు

  • ముంబై నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడిన సోనాల్ భూచర్
  • విద్యార్థుల కోసం అనేక దాతృత్వ కార్యక్రమాలు
  • జనవరి 2023లో టెక్సాస్‌లో ఏర్పాటు చేసే స్కూలుకు సోనాల్ పేరు
అమెరికాలోని ఓ ప్రాథమిక పాఠశాలకు భారతీయ అమెరికన్ పేరు పెట్టనున్నారు. టెక్సాస్‌లో త్వరలో ఏర్పాటు చేయనున్న ప్రాథమిక పాఠశాల 53కి భారతీయ అమెరికన్ ఫిజియో థెరపిస్ట్, సామాజిక కార్యకర్త అయిన సోనాల్ భూచర్ పెట్టాలని 'ద ఫోర్ట్ బెండ్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్' (ఎఫ్‌బీఐఎస్‌డీ) ధర్మకర్తల మండలి సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. రివర్‌స్టోన్ కమ్యూనిటీలో జనవరి 2023లో ఈ స్కూల్‌ను ప్రారంభించనున్నారు.

ముంబైకి చెందిన సోనాల్ బొంబాయి విశ్వవిద్యాలయంలో ఫిజియో థెరపీలో డిగ్రీ చేశారు. అనంతరం 1984లో భర్త సుబోధ్ భూచర్‌తో కలిసి అమెరికాలోని హ్యూస్టన్‌కు వెళ్లి స్థిరపడ్డారు. సామాజిక కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్న సోనాల్ విద్యార్థుల కోసం అనేక దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు. ఆమె సేవలకు గుర్తింపుగా టెక్సాస్‌లో ఏర్పాటు చేయనున్న స్కూలుకు ఆమె పేరు పెట్టాలని నిర్ణయించారు. కాగా, కేన్సర్ సంబంధిత సమస్యలతో బాధపడుతూ సోనాల్ 58 ఏళ్ల వయసులో 2019లో మృతి చెందారు.


More Telugu News