45 ఏళ్లు దాటిన వారికి అందరికీ ఈరోజు నుంచి వ్యాక్సినేషన్

  • దేశ వ్యాప్తంగా శరవేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్
  • వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు చేసిన ఇరు తెలుగు రాష్ట్రాలు
  • తెలంగాణలో 45 ఏళ్లు దాటిన వారి సంఖ్య 80 లక్షలు
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు కరోనా వారియర్స్ కు, 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈరోజు నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నాారు.

వ్యాక్సినేషన్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక అంచనా ప్రకారం తెలంగాణలో 45 ఏళ్లు పైబడిన వారు 80 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ వ్యాక్సిన్ అందించేందుకు వైద్య శాఖ ఏర్పాట్లు  చేసింది. ఏపీ విషయానికి వస్తే... పట్టణాల్లో పీహెచ్సీల్లో, గ్రామీణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాల్లో వ్యాక్సిన్ వేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈరోజు వ్యాక్సిన్ తీసుకోబోతున్నారు.


More Telugu News