నాగార్జునసాగర్‌లో 17 మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ

  • బీజేపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నివేదిత
  • బరిలో మిగిలింది 60 మంది
  • ఎల్లుండి వరకు ఉపసంహరణ గడువు
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో బీజేపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నివేదిత రెడ్డికి షాక్ తగిలింది. ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది. నిన్న నామినేషన్లను పరిశీలించిన అధికారులు మొత్తం 17 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. ఇందులో నివేదిత రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి, మరో 15 మంది స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు ఉన్నాయి. దీంతో పోటీలో 60 మంది అభ్యర్థులు మిగిలారు.

మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఎల్లుండి వరకు ఉంది. నోముల నర్సింహయ్య మృతితో నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నిక అనివార్యం కాగా, ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి. టీఆర్ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బీజేపీ నుంచి రవినాయక్ నామినేషన్లు దాఖలు చేశారు.


More Telugu News