తెలంగాణ, ఏపీలకు అవార్డులు ప్రకటించిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ

  • దీన్ దయాళ్ అవార్డులు ప్రకటించిన కేంద్రం
  • పంచాయత్ సశక్తీకరణ్ పేరిట అవార్డులు
  • చెరో 13 అవార్డులు సొంతం చేసుకున్న తెలుగు రాష్ట్రాలు
  • పరిషత్ లు, గ్రామ పంచాయతీలకు పురస్కారాలు
కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ 'దీన్ దయాళ్ పంచాయత్ సశక్తీకరణ్' అవార్డులు ప్రకటించగా, తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీలు అవార్డులు దక్కించుకున్నాయి. పలు విభాగాల్లో చెరో 13 పురస్కారాలకు ఎంపికయ్యాయి.

ఏపీలో కొండేపల్లి (ప్రకాశం), గుళ్లపల్లి (గుంటూరు జిల్లా),  వర్కూరు (కర్నూలు జిల్లా), పెదలబుడు (విశాఖ జిల్లా), రేణిమాకులపల్లె (చిత్తూరు జిల్లా), తడ కండ్రిగ, తాళ్లపాలెం (నెల్లూరు జిల్లా) గ్రామ పంచాయతీలు అవార్డు గెలుచుకున్నాయి.

తెలంగాణలో సుందిళ్ల (పెద్దపల్లి జిల్లా) గ్రామ పంచాయతీ రెండు విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకుంది. పర్లపల్లి (కరీంనగర్ జిల్లా), మిట్టపల్లె, మల్యాల (సిద్ధిపేట జిల్లా), చక్రాపూర్ (మహబూబ్ నగర్ జిల్లా), రుయ్యాండి (ఆదిలాబాద్ జిల్లా), హరిదాస్ నగర్, మోహినీ కుంట (కరీంనగర్ జిల్లా) పంచాయతీలు సైతం కేంద్రం గుర్తింపు పొందాయి.

పరిషత్ ల విషయానికొస్తే... తెలంగాణలో ధర్మారం, కోరుట్ల మండల పరిషత్ లతో పాటు మెదక్ జిల్లా పరిషత్... ఏపీలో అనంతపురం జిల్లా పెనుకొండ, కృష్ణా జిల్లా విజయవాడ రూరల్, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్, చిత్తూరు జిల్లా సదుం మండలాలతో పాటు, కృష్ణా, గుంటూరు జిల్లా పరిషత్ కేంద్రం ప్రకటించిన 'దీన్ దయాళ్' అవార్డుకు ఎంపికయ్యాయి.


More Telugu News