ఆహారశుద్ధి రంగానికి కేంద్రం రూ.10,900 కోట్ల ప్రోత్సాహకాలు!
- పీఎల్ఐ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
- 2.5 లక్షల ఉద్యోగాలు రానున్నట్లు అంచనా
- ఎగుమతులు సైతం భారీగా పెరిగే అవకాశం
- ఇప్పటి వరకు ఆరు రంగాలకు పీఎల్‌ఐ వర్తింపు
ఆహారశుద్ధి రంగానికి రూ.10,900 కోట్ల మేర ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని(పీఎల్‌ఐ) కేంద్రం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. దీనివల్ల దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు రానున్నట్లు అంచనా వేశారు. ఎగుమతులు సైతం భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ నిర్ణయం దేశ రైతులకు లబ్ధి చేకూరుస్తుందని కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 12-13 రంగాలకు పీఎల్‌ఐ పథకాన్ని ప్రకటిస్తున్నట్లు బడ్జెట్‌లో తెలపగా.. ఇప్పటికే ఆరు రంగాలకు వర్తింపజేసినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.