ఇతర రాష్ట్రాల నుంచి నందిగ్రామ్ కు గూండాలొచ్చారు: మమతా బెనర్జీ ఆరోపణలు

  • ఈసీకి ఫిర్యాదు చేసిన తృణమూల్‌ అధినేత్రి 
  • నందిగ్రామ్‌లో దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణ
  • ఓటమి భయంతోనే ఆరోపణలని బీజేపీ విమర్శలు
ఓటర్లను భయపెట్టేందుకు ఇతర రాష్ట్రాల నుంచి నందిగ్రామ్ కు పెద్ద సంఖ్యలో గూండాలు వచ్చారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్‌ నియోజకవర్గంలోని గ్రామాల్లోకి ప్రవేశించి ఓటర్లను భయపెడుతున్నారని ఆరోపించారు. బలరాంపూర్‌ సహా ఇతర ప్రాంతాల్లో దాడులు చేసిన ఘటనలు వెలుగు చూసినట్లు చెప్పారు.

మమత వ్యాఖ్యలపై బీజేపీ నేత జయప్రకాశ్‌ మజుందార్‌ స్పందించారు. ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కాగా, గురువారం జరిగే రెండో దశ పోలింగ్‌లో అందరి దృష్టి మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేస్తున్న నందిగ్రామ్‌పై కేంద్రీకృతమై ఉంది.


More Telugu News