నిప్పుల కుంపటిలా ఏపీ... మార్కాపురంలో రికార్డు స్థాయిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత

  • కొన్నిరోజులుగా ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు
  • అగ్నిగుండంలా రాష్ట్రం
  • అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటిన వైనం
  • మరో మూడ్రోజులు ఇలాగే ఉంటుందన్న వాతావరణ శాఖ
గత కొన్నిరోజులుగా ఏపీ అగ్నిగుండాన్ని తలపిస్తోంది. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ భానుడి ధాటికి రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపించింది. అనేకచోట్ల తీవ్రస్థాయిలో ఉష్ణోగతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో రికార్డు స్థాయిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

కడపలో 44.3, విజయనగరం 43.8, విజయవాడలో 43.5, తిరుపతి 43.5, నెల్లూరు 42.6, కర్నూలు 42.3, గుంటూరు 42.1, అనంతపురం 41.8, శ్రీకాకుళం 41, ఏలూరు 41, ఒంగోలు 40, విశాఖ 39.8, కాకినాడలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడ్రోజుల పాటు రాష్ట్రంలో ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.


More Telugu News