నిమ్మగడ్డపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడిన మంత్రి పేర్ని నాని
- పరిషత్ ఎన్నికలపై గవర్నర్ కు నిమ్మగడ్డ లేఖ
- శ్రీరంగనీతుల లేఖ అంటూ పేర్నినాని ధ్వజం
- బ్రహ్మచర్యంపై తిరుగుబోతు పుస్తకం రాసినట్టుందని ఎద్దేవా
- చంద్రబాబు కనుసన్నల్లో పనిచేశారని ఆరోపణ
ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ గా పదవీ విరమణ చేస్తున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని నిమ్మగడ్డ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖరాయడంపై పేర్ని నాని ఘాటుగా స్పందించారు. నిమ్మగడ్డ శ్రీరంగనీతుల లేఖ విడుదల చేశారని ఎద్దేవా చేశారు.
బ్రహ్మచర్యంపై ఓ తిరుగుబోతు పుస్తకం రాసినట్టుందని విమర్శించారు. నిమ్మగడ్డ లేఖను చూస్తే చెప్పే మాటలకు, చేసే పనులకు ఏమాత్రం పొంతన కుదరడంలేదన్న విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు.
నిమ్మగడ్డ ఎవరి మెప్పుకోసం పనిచేశారో అందరికీ తెలుసని, బాబు కనుసన్నల్లోనే ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. కరోనా కేసులు లేనప్పుడు ఎన్నికలు ఆపి, కేసులు వస్తున్నప్పుడు ఎన్నికలు జరిపారని మండిపడ్డారు.