ఏపీలో కరోనా మరింత తీవ్రం... ఒక్కరోజులో 1,184 కేసులు
- గత 24 గంటల్లో 30,964 కరోనా పరీక్షలు
- గుంటూరు జిల్లాలో 352 మందికి పాజిటివ్
- విశాఖ జిల్లాలో 186 కేసులు
- రాష్ట్రంలో నలుగురి మృతి
- 7,338కి పెరిగిన యాక్టివ్ కేసుల సంఖ్య
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడడంలేదు. కొన్ని వారాల కిందట ఉన్న పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి ఎంతో వ్యత్యాసం ఉంది. కొత్త కేసుల సంఖ్య వెయ్యికి పైగా నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో 30,964 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,184 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
అత్యధికంగా గుంటూరు జిల్లాలో 352 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత విశాఖ జిల్లాలో 186, చిత్తూరు జిల్లాలో 115, కృష్ణా జిల్లాలో 113 కేసులు గుర్తించారు. అదే సమయంలో 456 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, నలుగురు మృత్యువాత పడ్డారు. వారిలో చిత్తూరు జిల్లాకు చెందినవారు ముగ్గురున్నారు.
ఇక, ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,01,989కి పెరిగింది. 8,87,434 మంది కోలుకోగా 7,338 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,217కి పెరిగింది.