గుడిలో పూజ‌లు చేసిన రాహుల్ గాంధీ!

  • అసోం ఎన్నిక‌ల నేప‌థ్యంలో పూజ‌లు
  • గువాహ‌టిలోని కామాఖ్య ఆల‌యం  సందర్శ‌న‌
  • తాము ఐదు హామీలు ఇచ్చామ‌న్న రాహుల్‌
  • సీఏఏను అమ‌లు చేయ‌బోమ‌ని వ్యాఖ్య‌
అసోం ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఈ రోజు ఉద‌యం గువాహ‌టిలోని కామాఖ్య ఆల‌యాన్ని సంద‌ర్శించుకుని అమ్మ‌వారికి పూజ‌లు చేశారు. రాష్ట్ర ఓట‌ర్ల‌కు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఐదు హామీలు ఇచ్చింద‌ని ఆయ‌న చెప్పారు. తాము ముందుగా చెప్పిన‌ట్లుగానే అధికారంలోకి వ‌స్తే సీఏఏను అమ‌లు చేయ‌బోమ‌ని తెలిపారు.

ఒకవేళ దాన్ని అమ‌లు చేస్తే అస్సామీ భాష‌, సంస్కృతిపై దాడి జ‌రుగుతుంద‌ని ఆరోపించారు. తమ‌ది బీజేపీ లాంటి పార్టీ కాద‌ని, హామీ ఇస్తే త‌ప్ప‌క‌ నెర‌వేర్చుతామ‌ని చెప్పారు. రాష్ట్రంలో తేయాకు తోట‌ల్లో ప‌నిచేసే కార్మికుల‌కు రోజుకి క‌నీస వేత‌నంగా రూ.365 నిర్ణయిస్తామని తెలిపారు. అలాగే, 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్తును ఇస్తామ‌ని ఆయ‌న చెప్పారు.


More Telugu News