కుమార స్వామికి బీజేపీ రూ.10 కోట్లు ఇచ్చింది: కాంగ్రెస్ నేత ఆరోప‌ణ‌

  • క‌ర్ణాట‌కలోని బ‌స‌వ ‌క‌ల్యాణ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక
  • పోటీ చేస్తున్న‌ జేడీఎస్ అభ్య‌ర్థి
  • జేడీఎస్ వెనుక బీజేపీ ఉంద‌ని ఆరోప‌ణ‌లు
క‌ర్ణాట‌కలోని బ‌స‌వ ‌క‌ల్యాణ్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేప‌థ్యంలో బీజేపీ నుంచి క‌ర్ణాట‌క మాజీ సీఎం, జేడీఎస్ నేత‌ కుమార‌ స్వామి రూ.10 కోట్లు తీసుకున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌మీర్ అహ్మ‌ద్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఆ నియోజ‌క ‌వ‌ర్గం నుంచి పోటీకి జేడీఎస్ అభ్య‌ర్థిని నిల‌బెట్టార‌ని ఆయ‌న చెప్పారు. దీంతో సదరు కాంగ్రెస్ నేతపై జేడీఎస్ నేత‌లు మండిప‌డుతున్నారు.

కాగా, బ‌స‌వ క‌ల్యాణ్ స్థానానికి ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ నేత బి.నారాయ‌ణ్ రావు క‌రోనా కార‌ణంగా గత ఏడాది క‌న్ను మూయ‌డంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక నిర్వ‌హిస్తున్నారు. ఈ స్థానం నుంచి జేడీఎస్ పోటీ చేయ‌డం వెనుక బీజేపీ ఉంద‌ని, ఓట్ల‌ను చీల్చ‌డానికి య‌త్నిస్తున్నార‌ని కాంగ్రెస్ ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంది.


More Telugu News