తన గోత్రం గురించి తొలిసారి చెప్పిన మమతా బెనర్జీ
- నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం
- బ్రాహ్మణ వర్గానికి చెందిన శాండిల్య గోత్రమని వ్యాఖ్య
- గతంలో పూజారులు అడిగినా చెప్పని మమత
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీల్‌చైర్ పైనే కూర్చొని ప్రచారం చేస్తోన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలిసారి తన గోత్రం ఏంటనే విషయాన్ని ప్రజలకు చెప్పారు. నందిగ్రామ్‌లో ఆమె ప్రచార కార్యక్రమాలు ముగిశాయి. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ.. తనది బ్రాహ్మణ వర్గానికి చెందిన శాండిల్య గోత్రమని చెప్పారు.
గతంలో ఆమె ఎప్పుడూ తనది ఏ గోత్రం అన్న విషయాన్ని బయటపెట్టలేదు. తాను ఆలయాలకు వెళ్తే పూజారులు తన గోత్రం అడిగారని, అయితే, ఆ సమయాల్లో తాను మా మాతి మనుష్ అని తాను చెప్పినట్లు మమతా బెనర్జీ గతంలో చెప్పారు. అయితే, ఈ సారి ఆమె స్వయంగా తన గోత్రం గురించి చెప్పడం గమనార్హం.